
ఒకసారి షూటింగ్ నిమిత్తం ప్రముఖ డైరక్టర్ పి.పుల్లయ్య తన పద్మశ్రీ ప్రొడక్షన్స్ యూనిట్‌తో హైదరాబాద్‌నుండి వైజాగ్ హార్బర్‌కు ఆర్టిస్టులతో సహా సూర్యకాంతం కూడా బయలుదేరింది.... ఆ ఫ్లైట్ గన్నవరం దగ్గర కొద్దిసేపు ఆగి మళ్లీ వైజాగ్‌కు బయలుదేరింది. అయితే దర్శకుడు పి.పుల్లయ్య ఆందోళనతో రెండు చెవులు ఊరికే తెగ రుద్దేసు కుంటున్నాడు. అది గమనించిన ఎయిర్‌హోస్టెస్ పుల్లయ్యతో ‘మరేం భయపడకండి. సూర్యకాంతం గన్నవరం లోనే ఉండిపోయారు. ఆమెను క్షేమంగా ఇంకో ఫ్లైట్ ఎక్కించి వైజాగ్‌కు పంపిస్తామంది. దానితో పుల్లయ్య ఒక్కసారిగా నిట్టూర్పు విడిచి ‘ఇందాకటినుంచి సూర్యకాంతం మాటలేమీ ఫ్లైట్‌లో వినపడకపో యేసరికి నాకేదో చెవుడు వచ్చిందని అనుకుని హడలి చచ్చిపోయాను’ అన్నాడట.
No comments:
Post a Comment